Dacoit

Dacoit: షాకింగ్! షూటింగ్‌లో హీరో, హీరోయిన్‌కు గాయాలు!

Dacoit: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘డకాయిట్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. షానీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. స్టంట్ సీక్వెన్స్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కిందపడటంతో గాయాలయ్యాయి. అడివి శేష్ కాలికి గట్టి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ, వారు ప్రొఫెషనలిజంతో షూటింగ్‌ను పూర్తి చేశారు.

Also Read: Hari Hara Veeramallu Twitter Review: హరి హర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

సెట్‌లోనే ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. స్వల్ప గాయాలతో ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ఘటన అభిమానుల్లో ఆందోళన కలిగించినప్పటికీ, ఇద్దరూ త్వరగానే కోలుకున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu Naidu: 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్యనమస్కారాలతో.. గిన్నిస్‌ రికార్డు సాధించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *