Adivi Sesh: ‘గూడచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్2’ వరుస విజయాలతో ప్రామిసింగ్ హీరో అయిపోయాడు అడవి శేష్. ప్రస్తుతం ‘గూడచారి2’, ‘డెకాయిట్: ఎ లవ్ స్టోరీ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు శేష్. సినిమాలే కాదు బ్రాండింగ్ లోనూ దూసుకుకోపోతున్నాడు. సినిమాల కథల ఎంపికలో ప్రత్యకతను చాటుకుంటున్న అడవిశేష్ బ్రాండింగ్స్ ఎంపికలోనూ విశిష్టతను చూపిస్తున్నాడు. తాజాగా ఆహా గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. తనపై చిత్రీకరించిన యాడ్ ప్రస్తుతం ప్రదర్శితం అవుతోంది. ఇదిలా ఉంటే దీనితో పాటే ఓ ఎన్.ఆర్.ఐ క్లోత్ బ్రాండ్ కి, మేబాజ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. ఇక వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో చేస్తున్న స్పై థ్రిల్లర్ ‘జి2’లో అడవిశేష్ తో పాటు ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ షానియల్ డియోని దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘డెకాయిట్: ఎ లవ్ స్టోరీ’ రూపొందుతోంది. మరి ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే మరిన్ని బ్రాండింగ్స్ అడివి శేష్ పరమయ్యే అవకాశం లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో.
