adityaram

Adityaram: సహాయం చేయడమే ఆయనకు పెద్ద పండగ

Adityaram: మనమంతా పండగొస్తే ఎం చేస్తాం .  కొత్త బట్టలు . . పిండివంటలు . . మన స్థాయిని బట్టి కొనుక్కుంటాం . ఓ సినిమాకి వెళతాం లేదా కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తాం .  సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఒక్కోరకమైన అభిరుచి ఉంటుంది దానికి అనుగుణంగానే పండగ గడుపుతారు. లేనివారైనా . . మధ్యతరగతి వారైనా బాగా డబ్బున్న వాళ్ళు అయినా  దాదాపుగా అంతే .  కానీ ,  పండగ వచ్చిందంటే కొన్ని వేలమందికి బట్టలు ,  నిత్యావసరాలు ఇవ్వడమే కాకుండా వారిలో ఎవరికైనా తీరని కష్టం ఉంటె దానిని తీర్చే వారుంటారా ?  వెంటనే ఆబ్బె అలా ఎవరు ఉంటారు ?  మహా అయితే ఓ పది మందికి తిండి పెట్టడమో లేదా బట్టలు పెట్టడమో చేస్తే గొప్ప అని అనుకుంటాం .  దాదాపుగా అది నిజం కూడా .

అయితే ప్రఖ్యాత ఆదిత్య గ్రూప్ చైర్మన్ ఆదిత్య రామ్ మాత్రం కొన్నివేల మందికి పైన చెప్పిన విధంగా పండగ వేళ తానొక మహర్షిలా ఐదువేల మందికి పైగా ప్రజలకు ఒక తపస్సులా సేవా కార్యక్రమం నిర్వహిస్తారు .  అందరికీ బట్టలు ,  నిత్యావసరాలు ఇవ్వడమే కాకుండా . . ప్రత్యేకంగా కష్టాల్లో ఉన్నవారికి వారి అవసరాలు తీరేలా సహాయం చేస్తారు .  సంపాదించడం ఒక కళ అంటారు . . అలాగే సంపాదించింది సద్వినియోగం చేయడం ఒక తపస్సు .  సంపాదించింది దాచుకోవడానికి . . తర్వాత తరాల కోసం అని పోగు వేయడానికి అని కాకుండా . . పండగల వేళ అవసరార్థులకు సహాయపడడంలో ఉండే ఆనందం వేరు అని ఆదిత్యారామ్ నిరూపిస్తున్నారు .

ఆదిత్యరామ్‌ అనగానే అమలాపురం అల్లునిగా ఒక తెలుగువాడుగా చెన్నైలో ఫుల్‌ ఫేమస్‌. ఈ ఏడాది సంక్రాంతి పండగకి ఆయన 5000 మందికి పైగా వారందరి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యావసరాలను సాయంగా అందించారు. ఇవన్నీ దేనికోసం అన్నప్పుడు ఆదిత్యారామ్‌ ‘‘ నేను చాలా చిన్న స్థాయినుండి ఈ స్థాయివరకు వచ్చాను. అవసరాలు ఎలా ఉంటాయో అవి అవసరమైన వారికే తెలుస్తాయి. నాకు పేదల అవసరాలు తెలుసు. అందుకే చేతనైన సాయం వీలైనంతమందికి చేస్తుంటాను. ఈ పండక్కి దాదాపు 5000 మందికి పైగానే నిత్యావసరాలను అందించే చేసే అవకాశం దక్కింది. ఇలానే మీ ఆశీస్సులు ఉంటే వీలైనంత ఎక్కువమందికి అవసరమైన సాయం చేస్తుంటాను’’ అన్నారు.

ఆదిత్యారామ్ చేసే సేవా కార్యక్రమాలతో నిజమైన పండుగ అక్కడే ఉంది అని అనిపిసుందనడంలో సందేహమే లేదు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *