Aditi Rao Hydari: బాలీవుడ్ నటి అదితి రావు హైదరి.. తన పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి ఫొటోగ్రాఫర్లను మోసం చేస్తున్న వ్యక్తి గురించి స్పందించారు. తన పేరు, ఫొటో దుర్వినియోగం చేస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Nagarjuna Akkineni: తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్.. ఇండస్ట్రీ తో పాటు సామాన్యుల డేటా సేవ్
బాలీవుడ్ నటి అదితి రావు హైదరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన పేరు, ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్‌గా పెట్టుకుని ఓ వ్యక్తి ఫొటోగ్రాఫర్లను ఫొటోషూట్స్ పేరిట మోసం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు తన దృష్టికి తీసుకొచ్చారని, అలాంటి మెసేజ్‌లు తాను చేయలేదని స్పష్టం చేశారు. ఫొటోషూట్ కోసం ఎవరినైనా సంప్రదించాలంటే తన వ్యక్తిగత నంబర్ ఉపయోగించనని, టీమ్ ద్వారానే సంప్రదిస్తానని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా arhconnect ద్వారా తెలియజేయాలని కోరారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
