Adilabad Floods

Adilabad Floods: వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన కారు

Adilabad Floods: ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు విపరీత ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యి, రహదారులు చెరువులను తలపించేలా మారిపోయాయి.

ఈ క్రమంలో శనివారం కోజా కాలనీలో ఓ వ్యక్తి కారు వరదలో కొట్టుకుపోయిన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే, ఆ వ్యక్తి వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న రోడ్డును కారుతో దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ప్రవాహం మరింత పెరగడంతో కారు ముందుకు కదలలేక నీటిలో నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి: Mahaa Vamsi: బాబు ఎమోషనల్..లోకేష్ వార్నింగ్..పవన్ క్లారిటీ..

పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్లు గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును వదిలి బయటకు వచ్చి సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాడు. అతను బయటపడిన కొద్ది క్షణాలకే, ఉధృత వరద ప్రవాహానికి ఆ కారు కాగితపు పడవలా కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది.

స్థానికులు ఈ ఘటనను చూసి షాక్‌కు గురయ్యారు. అధికారులు ప్రజలను వరద సమయంలో వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పనులకే బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *