Adilabad:ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. వార్డులో బెడ్‌పై పడుకొని ఉన్న తల్లీబిడ్డలపై సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది. దీంతో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. వైద్యాధికారుల అలసత్వాన్ని, ఆ ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బంది వైఫల్యాన్ని తెలుపుతున్నది. తల్లి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, రెండు రోజుల చిన్నారి మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Adilabad:ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ పండంటి కూతురుకు జన్మనిచ్చింది. రెండోరోజైన ఆదివారం ఉదయం బెడ్‌పై తల్లీకూతురు ఉండగానే, ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ తెగి వారిపై పడింది. ఈ ఘటనలో పాపకు తీవ్రగాయాలయ్యాయి. తల్లికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే పాపకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.