Vahini

Vahini: క్యాన్సర్తో పోరాడుతున్న నటి వాహిని!

Vahini: టాలీవుడ్ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్సకు భారీ ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. నటి కరాటే కళ్యాణి సాయం కోరారు.

Also Read: Kajal Aggarwal: వెబ్ సిరీస్‌లోకి కాజల్ ఎంట్రీ?

ప్రముఖ సహాయ నటి వాహిని గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్నారు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అధునాతన చికిత్స అందిస్తున్న వైద్యులు మొత్తం ట్రీట్‌మెంట్‌కు సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.ఈ భారీ మొత్తం వాహిని కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది. విషయం తెలిసిన వెంటనే నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వాహిని చికిత్సకు అందరూ ఆర్థికంగా సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పోస్ట్ వైరల్ కాగానే టాలీవుడ్ అభిమానులు స్పందిస్తున్నారు. సినీ పెద్దలు సాయం అందించేందుకు ముందుకు రావాలని కామెంట్స్ చేస్తున్నారు. వాహిని గతంలో అనేక సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమె త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌కు రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఈ కష్ట సమయంలో వాహినికి మద్దతుగా నిలవాలని టాలీవుడ్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *