Roja Daughter: టాలీవుడ్ మాజీ నటి ఇంకా పొలిటిషియన్ రోజా కూతురు అన్షు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.నైజీరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్’లో సందడి చేసింది. ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేసినట్టేనంటున్నారు. నిజానికి రోజా కూతురికి మాములు టాలెంట్ లేదు. ఈమె రైటర్ గా, వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు సంపాదిస్తోంది.

Beta feature
