Gold Smuggling: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుండి బెంగళూరుకు విమానంలో 15 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు ప్రముఖ నటి రన్యా రావు అరెస్టు అయ్యారు. ఆమె తమిళ చిత్రం వాగలో నటుడు విక్రమ్ ప్రభుతో కలిసి నటించింది. అయితే, ఆమెకు తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో సెక్సీ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసి, సినిమా అవకాశం కోసం ఎదురు చూసింది.
ఈ పరిస్థితిలో, రన్యా రావు తరచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్లు అదేవిధంగా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతోందని ఢిల్లీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. ఇటీవలే రన్యా రావు దుబాయ్ వెళ్ళింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, ఆమె బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.దుబాయ్ నుండి వచ్చిన విమానం మంగళవారం సాయంత్రం 7:00 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
ఇది కూడా చదవండి: Kalpana: సింగర్ కల్పన సూసైడ్ ఆత్మహత్యాయత్నం.
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆమెను ఆపారు. ఆమె వస్తువులను సోదా చేశారు. ఇందులో ఆమె బ్యాగు నుంచి 14.80 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 12 కోట్ల రూపాయలు. అధికారులు రన్యా రావును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. రన్యా రావు గతంలో చాలాసార్లు బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడిందని.. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చిందని తెలిసింది.