Ramya Sri

Ramya Sri: సినీ నటి రమ్యశ్రీ, సోదరుడిపై దాడి

Ramya Sri: గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (ఎఫ్‌సీఐ) లేఅవుట్‌లో కొనసాగుతున్న స్థల వివాదం తీవ్ర రూపం దాల్చింది. సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌లపై కొందరు దుండగులు దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల రోజుల క్రితం, హైడ్రా (HYDRA) అధికారులు సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను తొలగించారు. అనుమతులు లేకుండా నిర్మించిన మినీహాల్, గదులు, రెండు షెడ్లను నేలమట్టం చేశారు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు ఎఫ్‌సీఐ లేఅవుట్‌లోని రహదారులను, పార్కుల స్థలాలను ఆక్రమించి వాటి ఆనవాళ్లను తొలగించారని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, మంగళవారం నాడు హైడ్రా, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్ అధికారులు లేఅవుట్‌లో రహదారులను గుర్తించే పనులను ప్రారంభించారు. ప్లాట్ యజమానులలో ఒకరైన సినీ నటి రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్‌తో కలిసి ఈ పనులను పర్యవేక్షించడానికి వచ్చారు. వారు భోజనానికి వెళ్తుండగా, శ్రీధర్‌రావు అనుచరులు వారిని అడ్డగించారు.

Also Read: KTR: నేడు లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు కేటీఆర్‌

Ramya Sri: రమ్యశ్రీ, ప్రశాంత్ రోడ్డు మార్కింగ్‌ను వీడియో తీస్తున్నారని ఆరోపిస్తూ శ్రీధర్‌రావు అనుచరులు వారి ఫోన్‌లు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. దుండగులు రమ్యశ్రీ, ప్రశాంత్‌లపై క్రికెట్ బ్యాట్, కత్తితో దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ప్రశాంత్ అడ్డుకోవడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ దాడితో తీవ్ర భయాందోళనకు గురైన రమ్యశ్రీ, ప్రశాంత్ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు అక్రమాలకు అడ్డుకట్ట వేసి తమకు రక్షణ కల్పించాలని రమ్యశ్రీ తన ఫిర్యాదులో కోరారు. రమ్యశ్రీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య రహదారుల గుర్తింపు పనులు కొనసాగాయి. అయితే, ఈ దాడి అధికారుల సమక్షంలో జరగలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

ALSO READ  Gold rate: ఆల్ టైమ్ హైకి బంగారం ధర 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *