Actress Kasturi: ప్రముఖ సినీ నటి, బిగ్ బాస్ 3 ఫేమ్ కస్తూరి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. కస్తూరితో పాటు నటి నమితా మారిముత్తు కూడా బీజేపీలో చేరారు. ఈ చేరికను పార్టీ అధికారికంగా ప్రకటించింది. కస్తూరి గతంలో కూడా రాజకీయాలపై తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరిచారు. సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై ఆమె ట్విట్టర్ వేదికగా తరచూ స్పందించేవారు.
బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా హిందూత్వం, జాతీయవాదం పట్ల ఆమెకున్న అనుకూల వైఖరి అప్పటికే ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇచ్చాయి.పార్టీలో చేరిన తర్వాత, కస్తూరి బీజేపీ కోసం తమిళనాడులో ప్రచారం చేస్తారని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని భావిస్తున్నారు. ఆమె ప్రజాదరణ, వాగ్ధాటి పార్టీకి ఉపయోగపడతాయని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఈ చేరికతో తమిళనాడులో బీజేపీ తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Free Bus Travel Scheme: బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణం..
కస్తూరితో పాటు బీజేపీలో చేరిన నమితా మారిముత్తు తమిళనాడుకు చెందిన మొదటి ట్రాన్స్‌జెండర్ నటి. ఆమె సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆమె చేరిక ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన వారిని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించాలనే బీజేపీ ఆలోచనను సూచిస్తుంది. కాగా కస్తూరి మోడల్‌గానే కాకుండా తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోని పలు సినిమాల్లోలోనూ తనదైన నటనతో మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా, పలు సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.