Janhvi Kapoor : బాలీవుడ్ ప్రముఖ నటి, ప్రఖ్యాత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హైదరాబాద్ వచ్చారు. తెలుగులో తొలి సినిమా దేవరలో నటించిన ఆమె.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. శ్రీదేవి కూతురుగా ఇప్పటికే ఎందరికో ఆరాధ్య హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. అయితే తాజాగా గురువారం హైదరాబాద్ వచ్చిన ఆమె అమీర్‌పేట వెంగళరావు నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జాన్వీ కపూర్ ఇటీవల దేవర మూవీలో జూనియర్ ఎన్ఠీఆర్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు . జాన్వీ కపూర్ ప్రస్తుతం మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించనున్నారని ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న టాక్ . బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తన ప్రత్యేకతను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు . శ్రీదేవి కూతురుగా తనకున్న ఇమేజిని మరింత పెంచుకోవడం కోసం జాన్వీ కపూర్ తెలుగు సినిమాలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు .