Ananya Nagalla : కనీస సంస్కారమైనా ఉండాలి .. అనన్య నాగళ్ళ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నటి అనన్య నాగళ్ళ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో ఆమెకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరోసారి తాను చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చారు అనన్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ “కొన్ని ప్రశ్నలకు మనం సంస్కారంతో ఆన్సర్ ఇవ్వాలి. అది ఎదుటివారికి ఉన్నా లేకున్నా సరే. ఆరోజు అదే నేను చేశాను. ఈ విషయంలో మీడియా నుండి సపోర్ట్ రావడం ఆనందం అనిపించింది. చాలా మంది ఆ రిపోర్టర్ అడిగినదానికి మేము సారీ చేపిస్తున్నామన్నారు. ఒక తెలుగు అమ్మాయికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది అనన్య.

ప్రస్తుతం అనన్య నటిస్తున్న పొట్టేల్ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ మూవీని సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేశాడు. పక్కా విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో ఎమోషన్ రైడ్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 1980 కాలం నాటి తెలంగాణలోని పరిస్థితులను మనకు ఈ సినిమాలో చూపెట్టనున్నారు. తన కూతురు చదువు కోసం ఓ తండ్రి ఎదుర్కొనే సమస్యలు.. ఓ పొట్టేలు వారికి ఎలాంటి అడ్డంకులను తెచ్చి పెట్టిందనేది ఈ సినిమా కథగా రాబోతుంది. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ కంటెంట్ బేస్డ్ మూవీపై ఇప్పటికైతే ఈ పాజిటివ్ టాక్ ఉంది. ఈ ట్రైలర్ లోని రా అండ్ రస్టిక్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా అనన్య నటిస్తోన్న శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా… సతీష్ వేగేశ్న గారి కథకళి సినిమా, ‘లేచింది మహిళా లోకం’అనే సినిమా చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *