Abhinaya

Abhinaya: పెళ్లి పీఠలెక్కుతున్న నటి అభినయ!

Abhinaya: టాలీవుడ్ టాలెంటెడ్ నటి అభినయ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది.ఈ శుభవార్తను ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. తనకు కాబోయే భర్తతో కలిసి గుడి గంట కొడుతూ చేతులు మాత్రమే కనిపిస్తున్న తమ ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది అభినయ. ఇంతకీ ఆమె పెళ్లాడబోయేది ఎవరిని? అనే విషయాన్ని మాత్రం రివీల్‌ చేయలేదు. అతని ముఖం చూపించలేదు. అయితే హీరో విశాల్‌తో అభినయ లవ్‌లో ఉన్నట్లు గతంలో చాలా రూమర్స్ వినిపించాయి. కానీ ఈ విషయం పై ఇద్దరు ఎప్పటికప్పుడు స్పందిస్తూ తమ మధ్య అలాంటిది ఏం లేదని తెలిపారు. ఇక ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ పిక్‌లో అభినయ తన కాబోయే భర్త ముఖం చూపించకపోవడంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ ఆమె పెళ్లాడాబోయేది ఎవ్వరిని..? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *