Vijay - Trisha

Vijay – Trisha: ఎవరితో నాకేంటి.. త్రిషతో విజయ్.. వైరల్ అవుతున్న వీడియోలు!

Vijay – Trisha: తమిళ స్టార్ హీరో, తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ప్రముఖ నటి త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ వేడుకకు వీరిద్దరూ ఒకే కారులో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ భార్య సంగీత ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఈ జంట బహిరంగంగా కలిసి కనిపించడం రాజకీయ ఇంకా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వివాదాల నడుమ విజయ్ ప్రయాణం

తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి.

గతంలో ఒక బీజేపీ నేత విజయ్ వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఆ సమయంలో త్రిష వాటిని కండించింది.తర్వాత బీజేపీ నాయకుడు క్షమాపణలు కూడా తెలిపారు.

ఈ విమర్శల తర్వాత విజయ్ భార్య సంగీత షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తన భర్త ఒక నటితో సంబంధం పెట్టుకున్నాడని, అందుకే తాను 2025 డిసెంబర్‌లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో ఉండగా, తదుపరి విచారణ ఏప్రిల్ 20న జరగనుంది.

పెళ్లి వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్

ఇన్ని గొడవల మధ్య విజయ్, త్రిష ఒకే కారులో వచ్చి పెళ్లి వేడుకలో దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ ప్రముఖులంతా హాజరైన ఈ వేడుకలో మీడియా కళ్లన్నీ ఈ జంటపైనే కేంద్రీకృతమయ్యాయి.

విజయ్ బ్లూ షర్ట్‌లో, త్రిష సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.

గతంలో వీరిద్దరూ కలిసి ‘ఘిల్లి’, ‘తిరుపాచి’, ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు భార్య ఆరోపణల తర్వాత కూడా వీరు కలిసి కనిపించడంతో, వారి బంధంపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

రాజకీయాలపై ప్రభావం ఎంత?

విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఇటువంటి వ్యక్తిగత వివాదాలు ఆయన ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు విడాకుల కేసు, మరోవైపు త్రిషతో కలిసి బహిరంగంగా కనిపించడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనా, చెన్నై వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *