sri vishnu birthday: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఫిబ్రవరి 28న శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న నెక్స్ట్ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది.శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘మృత్యుంజయ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాను హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. పూర్తి యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ‘జై’ అనే పాత్రలో శ్రీవిష్ణు సరికొత్త వేరియేషన్స్‌తో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రెబా జాన్ పోలీస్ పాత్రలో నటిస్తోంది. సామజవరాగమనా సినిమా తరువాత మరోసారి శ్రీ విష్ణుతో రొమాన్స్ చెయ్యనుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
sri vishnu birthday: తాజాగా శ్రీ విష్ణు, గీతా ఆర్ట్స్ మద్దతుతో అల్లు అరవింద్ సమర్పణలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్న విషయం తెలిసిందే . నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో వస్తున్నా సినిమాకు #సింగిల్ అనే టైటిల్ డిసైడ్ చేశారు .
sri vishnu birthday: ప్రేమికుల దినోత్సవానికి ముందు, నిర్మాతలు ఈ మూవీ టైటిల్ #సింగిల్‌ను ఆవిష్కరించారు. అలాగే ప్రేమను తృణీకరించి తన ఒంటరి జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తిగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. 35 ఏళ్లు దాటిన తర్వాత కూడా తాను ఇంకా ఒంటరిగా ఎందుకు ఉన్నానో వెన్నెల కిషోర్ చెప్పే కామెడీ డైలాగులతో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఒక చేతిలో పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్, మరో చేతిలో టపాకాయలు పట్టుకుని శ్రీ విష్ణు విచిత్రమైన గెటప్ లో ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది .