Raviteja father: టాలీవుడ్ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు కన్నుమూయగా, ఈ రోజు ఉదయం మాస్ మహారాజా రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, 90 సంవత్సరాల వయసున్న శ్రీ రాజగోపాల్ రాజు గారు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రాజగోపాల్ రాజు గారు హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త విన్న వెంటనే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త నుండి కోలుకోకముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.
Also Read: Delhi: ఏడేళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ విషాద వార్తతో ఆయన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. రాజగోపాల్ రాజు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అభిమానులు కూడా తమ ప్రియతమ నటుడికి సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో తమ విచారం వ్యక్తం చేస్తున్నారు.
రాజగోపాల్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, రవితేజ కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

