ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. సెప్టెంబర్ 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతకుముందు ప్రకాష్‌రాజ్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ప్రకాష్ రాజ్ తో పాటుగా వైసీపీ నేతలకు కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని చెప్పారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మారెడ్డే ప్రధాన కారణం. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ నేతలు పిచ్చి పట్టినట్లుగా మాట్లాడొద్దని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలో తాను మాజీ సీఎం జగన్‌ను నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి. లడ్డూ వ్యవహారంలో దోషులను శిక్షించమని చెప్పాలని పవన్ కళ్యాణ్ అన్నారు.