Actor Naresh: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో ఏర్పడిన టెక్నికల్ ఇష్యూస్‌తో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో తనకు ఎదురైన సమస్యపై నటుడు సీనియర్ నరేశ్ స్పందించారు. తనదైశన శైలిలో ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికలపై పంచుకున్నారు.
Actor Naresh: తాను గత బుధవారం ఉదయం 8.15 గంటలకు హైదరాబాద్‌లోని ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నట్టు నటుడు నరేశ్ తెలిపారు. కానీ, అప్పటికే అన్ని విమానాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. బోర్డింగ్ గేట్ల వద్ద మూసి ఉన్న దృశ్యాన్ని, ప్రయాణికుల అవస్థలను ఆయన తన సెల్‌ఫోన్‌లో బంధించారు. దానిపై ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు.
Actor Naresh: 90వ దశకంలోనే విమాన ప్రయాణాల్లోని సరదా ముగిసిపోయింది. విమాన సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. అంతా గందరగోళంగా ఉన్నది.. అంటూ తన పోస్టులో నటుడు నరేశ్ పేర్కొన్నారు. ఇప్పటి విమాన ప్రయాణాల కన్నా.. 1990ల నాటి విమాన ప్రయాణాలే సురక్షితంగా మెరుగ్గా ఉండేవని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Actor Naresh: మరో విషయంపైనా నటుడు నరేశ్ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తంచేశారు. సినీనటులకు ప్రైవైసీ అంటూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్కులు, సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా.. స్కానర్లు నటులను గుర్తించేస్తున్నాయని తెలిపారు. టైమ్ మెషీన్ ఉంటే బాగుండు.. 90ల నాటి రోజులకు వెళ్లిపోయేవాడిని అని నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

