Netflix-Dhanush

Netflix-Dhanush: ధనుష్ పై నెట్‌ఫ్లిక్స్ వేసిన పిటిషన్ ను కొట్టేసిన చెన్నై హైకోర్టు

Netflix-Dhanush: నయనతార డాక్యుమెంటరీ ‘’బియాండ్ ది ఫెయిరీ టేల్’’ కి సంబంధించి ధనుష్ వేసిన దావాను కొట్టివేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను చెన్నై హైకోర్టు కొట్టివేసింది.

నటి నయనతార-దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుకను డాక్యూమెంటరీ గా తీసి దాని ముంబైకి చెందిన ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ విడుదల చేసింది. ఇందులో నటుడు ధనుష్‌కి చెందిన ‘వండర్‌బార్‌ ఫిలింస్‌’ సంస్థ నిర్మించిన ‘నేను రౌడీ తాన్‌’ షూటింగ్‌లో తీసిన సన్నివేశాలను కూడా కొన్ని వాడరు. ఆ తర్వాత నయనతారకు నటుడు ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నోటీసు పంపారు. దీనిపై స్పందించిన నయనతార ధనుష్‌పై తీవ్ర విమర్శలు చేసింది.

నటి నయనతార, విఘ్నేష్ శివన్, ముంబైకి చెందిన నెట్‌ఫ్లిక్స్ కంపెనీలపై ధనుష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ‘సినిమాలో నయనతార నటన, వాయిస్‌ మా కంపెనీకి చెందినవి. ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ మా కంపెనీ యాజమాన్య ఫుటేజీతో పాటు నయనతార పెళ్లి వీడియోను విడుదల చేసింది. ఫలితంగా మాకు నష్టం వాటిల్లింది. కాబట్టి పరిహారంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి.’ అని ధనుష్ కోరారు 

ధనుష్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ఈరోజు (జనవరి,28) తోసిపుచ్చింది. చెన్నై ఐకోర్టులో కేసును కొనసాగించలేమని, దానిని కొట్టివేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి ఐకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరి 5న వండర్‌బార్‌ దాఖలు చేసిన కాపీరైట్‌ కేసును లిస్టింగ్‌ చేయాలని ఐకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *