Actor Darshan Arrest: కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకస్వామి హత్యకేసులో ప్రముఖ కన్నడ నటుడు ‘చాలెంజింగ్ స్టార్’ దర్శన్ మళ్లీ పోలీసుల కస్టడీలోకి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోని హొసకెరెహళ్లిలో తన భార్య నివాసానికి వెళ్లిన దర్శన్, మీడియా కళ్లను తప్పించుకునే ప్రయత్నంలో వెనుక ద్వారంవెంట లోపలికి ప్రవేశించారు. భార్య, కుమారుడిని కలిసిన కొద్ది సేపటికే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో సహనిందితురాలు, నటి పవిత్ర గౌడను కూడా ఆమె నివాసం నుంచి పోలీసులు అరెస్టు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశంతో అరెస్టు
రేణుకస్వామి హత్యకేసులో దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం, దర్శన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఆయన బయట ఉంటే విచారణపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.
అలాగే, సెలబ్రిటీ హోదాను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వడం “వక్రబుద్ధి” కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. “ప్రజాదరణ శిక్ష నుండి తప్పించుకునే కవచం కాదు” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: కిష్త్‌వార్‌లో క్లౌడ్‌బరస్ట్ బీభత్సం – 22 మంది మృతి
కేసు నేపథ్యం
-
33 ఏళ్ల రేణుకస్వామి, నటి పవిత్ర గౌడ అభిమానిగా చెప్పుకుంటూ ఆమెకు అసభ్య సందేశాలు పంపాడని ఆరోపణ.
-
2024 జూన్‌లో దర్శన్, అతని ముఠా రేణుకస్వామిని అపహరించి, బెంగళూరులోని ఓ షెడ్‌లో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొనబడింది.
-
దాడిలో విద్యుత్ పరికరంతో అతని ప్రైవేట్ భాగాలకు షాక్ ఇచ్చి, పదేపదే హింసించడంతో శరీరమంతా 39 గాయాలు, ఛాతీ ఎముకలు విరిగినట్లు వైద్య నివేదికలో ఉంది.
-
అనంతరం మృతదేహాన్ని మురుగు కాలువలో పడేసారు.
అరెస్టు, బెయిల్, మళ్లీ జైలు
-
2024 జూన్ 11న దర్శన్, పవిత్ర గౌడతో పాటు 15 మంది అరెస్ట్ అయ్యారు.
-
ఐదు నెలల జైలు జీవితం అనంతరం, 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
-
తాజాగా సుప్రీంకోర్టు ఆదేశంతో, మళ్లీ ఈ ఇద్దరినీ పోలీసులు జైలుకు పంపనున్నారు.