Allu Arjun: ఏఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో మంగళవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ధర్మాసనం స్వీకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారం జరిగే అవకాశం ఉన్నది.
Allu Arjun: ఏగత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌పై నంధ్యాలలో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా వేలాది మందిని జనమీసకరణ చేశాడని ఆ ప్రాంత స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ పీ రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌పై, వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.