Odisha: ఓ నేరస్థుడు కాలికి గొలుసుతో బంధించినప్పటికీ తప్పించుకున్నాడు. ఇప్పుడు అతని కోసం పోలీసులు తీవ్రంగా ఇల్లిల్లూ వెతుకుతున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ నేరస్థుడు పోలీసుల నుంచి సులువుగా తప్పించుకున్న వింత ఘటన వెలుగు చూసింది. విశేషమేమిటంటే.. పోలీసులు ఈ దొంగను అరెస్ట్ చేసి పారిపోకుండా కాలికి గొలుసుతో బంధించారు. అయితే హోటల్‌లోని పోలీసులు ఏసీలో కూర్చుని టిఫిన్ చేస్తుండగా దుండగుడు పారిపోయాడు. ఈ దృశ్యం హోటల్‌లోని సీసీటీవీలో రికార్డైంది.
అక్టోబరు 27 రాత్రి మహారాష్ట్రలోని అకోలా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ కేసులో నిందితుడు జుయల్ సాబర్‌ను అరెస్టు చేశారు. గజపతి జిల్లా మోహన వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు పోలీసులు హోటల్‌లో బస చేశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు రెస్టారెంట్ లో టిఫిన్ చేస్తున్న సమయంలో తలుపులు తెరుచుకుని పారిపోయాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. తినడం అపి నిందితుడ్ని వెతకడంలో నిమగ్నమయ్యారు.