Indian Immigrants: విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, అమెరికా మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించాలని గుర్తించింది. ఇప్పటివరకు 298 మంది వలసదారుల గురించి సమాచారం అందించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. వారిని పంపేటప్పుడు వారిపట్ల ఎటువంటి దుష్ప్రవర్తన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరి 4న, అమెరికా 104 మంది అక్రమ వలసదారులను చేతికి సంకెళ్లు, గొలుసులతో భారత్ కి తిప్పి పంపిన విషయం తెలిసిందే.
దురుసు ప్రవర్తన అంశాన్ని లేవనెత్తారు: భారతీయ వలసదారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అంశాన్ని అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మిస్రీ అన్నారు. భారతదేశానికి మరిన్ని బహిష్కరణ విమానాలు వస్తున్నాయా అని అడిగినప్పుడు. “తిరిగి వచ్చిన వారి సంఖ్యను వారు భారతీయ పౌరులు అని మేము నిర్ధారించే వరకు చెప్పడం కష్టం” అని మిస్రి అన్నారు.
ఇది క్కూడా చదవండి: Delhi Results: ఢిల్లీ లో బీజేపీ పరుగులు.. ఆప్ నాయకుల వెనుకడుగులు
అమెరికాలో 7.25 లక్షల మంది అక్రమ భారతీయ వలసదారులు: ప్యూ రీసెర్చ్ ప్రకారం, అమెరికాలో 7.25 లక్షలకు పైగా అక్రమ భారతీయ వలసదారులు ఉన్నారు. నవంబర్ 2024లో చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని 20,407 మంది భారతీయులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) గుర్తించింది. వీరిలో 2,467 మంది భారతీయులను ICE నిర్బంధ కేంద్రాల్లో బంధించారు. వీరిలో 104 మందిని ఇటీవల భారతదేశానికి తిప్పిపంపారు. ఇది కాకుండా, అరెస్టు చేయని 17,940 మంది భారతీయులు ఉన్నారు, కానీ వారి పాదాలకు లొకేషన్ ట్రాకర్లను ఏర్పాటు చేశారు.