Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రావడంతో వైట్ హౌస్ స్టెనోగ్రాఫర్ల(Stenographers) సమస్యలు ఎక్కువయ్యాయి. అక్కడి మీడియా కథనాల ప్రకారం ట్రంప్ బహిరంగ ప్రసంగాలలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారని, అతని స్టేట్‌మెంట్‌లను టైప్ చేయడంలో స్టెనోగ్రాఫర్‌లకు చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.
2021లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి వారంలో బిడెన్ కెమెరాలో 24,259 పదాలు మాట్లాడాడు. దీనికి ఆయనకు 2 గంటల 36 నిమిషాలు పట్టింది. అలాగే, ఈసారి ట్రంప్ 7 రోజుల్లో 81,235 పదాలు చెప్పారు. ఇన్ని మాటలు చెప్పడానికి ఆయనకు 7 గంటల 44 నిమిషాలు పట్టింది. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన పదాల సంఖ్య ‘మక్‌బెత్’, ‘హామ్లెట్’ – ‘రిచర్డ్ III’ వంటి మూడు పుస్తకాలలో కూడా లేవని స్టెనో గ్రాఫర్స్ అంటున్నారు.
Donald Trump: ఎనిమిదేళ్ల క్రితం ట్రంప్ (Donald Trump) తొలిసారిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతను తన మొదటి వారంలో 33,571 పదాలు చెప్పాడు. ఇన్ని మాటలు మాట్లాడేందుకు ఆయనకు 3 గంటల 41 నిమిషాల సమయం పట్టింది. అంటే రెండో టర్మ్‌లో ట్రంప్ మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు.
ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్ కు విలన్ గా మారిన అమెరికా 5 నిమిషాల్లో రూ.5 లక్షల కోట్లు నష్టం.
గత 4 ఏళ్లలో తక్కువ మాట్లాడే జో బిడెన్ స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయడం అలవాటు చేసుకున్న స్టెనోగ్రాఫర్‌లు ట్రంప్ ప్రసంగాన్ని రికార్డు చేయడంలో విసిగిపోయారు. పెరుగుతున్న పనిభారాన్ని ఎదుర్కోవడానికి మరింత మంది స్టెనోగ్రాఫర్‌లను నియమించుకోవాలని వైట్‌హౌస్ పరిశీలిస్తోందని అక్కడి మీడియా పేర్కొంది.
ఈ క్రమంలో జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. తన ప్రసంగంలో ఆయన 22 వేలకు పైగా పదాలు చెప్పాడు. నాలుగు రోజుల తరువాత, ఆయన కాలిఫోర్నియా అగ్నిప్రమాదంతో పోరాడుతున్న ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, 17 వేలకు పైగా మాటలు మాట్లాడారు.