Road Accident: చిత్తూరు జిల్లా నగరి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు తిరుపతి జిల్లాకు చెందినవారు, మరో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు.
ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడులోని అరక్కోణం నుంచి తిరుపతికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు నగరి సమీపంలో ఓవర్‌టేక్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన లారీతో ఢీకొంది. దీంతో బస్సు వెనుకభాగం తీవ్రంగా దెబ్బతింది.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: కుంభకర్ణుడు 6 నెలల తర్వాత నిద్ర నుండి మేల్కొంటాడు. కానీ ఎన్నికల కమిషన్ అస్సలు మేల్కోదు.
ఈ ఘటనలో తిరుపతి(Tirupati) జిల్లా వడమాలపేట మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారథి నాయుడు, రాజేంద్రనాయుడు, తమిళనాడులోని తిరుత్తణానికి చెందిన కుమార్, తిరువళ్లూరుకు చెందిన ధనుష్కోటి మరణించారు. స్థానికులు, పోలీసులు వెంటనే క్షతగాత్రులను నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

