Accident

Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!

Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి  సబర్‌కాంతలోని హిమ్మత్‌నగర్ హైవేపై బుధవారం ఉదయం ఇన్నోవా కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. ఒకరు  తీవ్రంగా గాయపడి హిమ్మత్‌నగర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కారులో ఉన్న 8 మంది అహ్మదాబాద్ వాసులేనని పోలీసులు తెలిపారు. వీరు షామ్లాజీ నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో కారు ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు బంపర్‌ ఊడిపోయి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. మృతదేహాలను బయటకు తీయడానికి, కారు బాడీని గ్యాస్ కట్టర్‌తో కత్తిరించాల్సి వచ్చింది.

Accidenet: పోలీసులు చెబుతున్నదాని ప్రకారం కారు అతివేగంగా ఉంది. సమాచారం అంది సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి  ఏడుగురు మరణించారని పోలీసులు చెప్పారు. మృతులను ధన్వాణి, చిరాగ్, రవిభాయ్, రోహిత్, గోవింద్, రాహుల్, రోహిత్, బార్త్‌లుగా గుర్తించారు. వారి వయస్సు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, 22 ఏళ్ల హనీభాయ్ శంకర్‌లాల్ తోత్వాని హిమ్మత్‌నగర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Accident: ఇటీవల కాలంలో వరుసగా ప్రమాదాలు.. 

Accident: సెప్టెంబర్ 15న రాజస్థాన్‌లోని బుండిలో ఓ ట్రక్కు కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కోటాకు తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు.

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో బోలెరో కారు ఓవర్‌బ్రిడ్జి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. అందరూ ఎంపీలోని షియోపూర్ వాసులు. ఈ వ్యక్తులు అజ్మీర్ దర్గాను సందర్శించి గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది

Accident: దామోహ్‌లో ముందు వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 1 వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు, వారు జబల్‌పూర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆటోలో 10 మంది ఉన్నట్లు సమాచారం. దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామన్న గ్రామం ఎదురుగా బండక్‌పూర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.

జూలై 7న గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలోని సపుతారా ఘాట్ వద్ద 65 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సపుతర, డాంగ్స్‌లోని ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చేర్పించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *