Crime News: సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణమైన ఘటనలకు అద్దం పట్టే మరో విషాద ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అల్లరి, అమాయకత్వం తప్ప మరో లోకం తెలియని ముగ్గురు చిన్నారి బాలికలను టార్గెట్ చేసుకుని, ఐస్ క్రీం కొనిస్తానని మాయమాటలు చెప్పి ఒక వ్యక్తి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఘటన వివరాలు
ఒడిశాలోని మల్కాజ్‌గిరి జిల్లా, కలిమెలి మండలంలో ఈ అమానుషం జరిగింది. ఓ వ్యక్తి తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు. వలని చూడగానే అతనిలో పడుకున్న మృగ్రామ్ నిద్రలేచింది. వెంటనే చిన్నపిల్లల దగ్గరికి వెళ్లి మాయామాటలు చేపి ఐస్ క్రీం కొనిస్త అని నమ్మించి. ముగ్గురిని తన ఇంటికి తీసుకోని వెళ్లి తర్వాత లైంగిక దాడి చేశాడు. ఈ చిన్నారుల వయసు 9 సంవత్సరాలు లోపల ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ఎవరికి చేపోదు అంటూ బెదిరించాడు
ఇది కూడా చదవండి: Raju Weds Rambai: రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షో…కానీ
వెలుగులోకి ఎలా వచ్చింది?
నిందితుడి బెదిరింపులకు భయపడకుండా, బాధిత చిన్నారులు ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి తమ కుటుంబ సభ్యులకు వివరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, నిందితుడు అప్పటికే పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారుల భద్రత పట్ల, ఇలాంటి మృగాళ్ల పట్ల సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

