Abhishek Sharma: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించి అరుదైన ఘనత సాధించాడు. తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మకు 829 రేటింగ్ పాయింట్లు లభించాయి, అదే సమయంలో ట్రావిస్ హెడ్ 814 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ తర్వాత అభిషేక్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్‌లో మరో భారత ఆటగాడు తిలక్ వర్మ కూడా 804 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read: Chahal: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. విడాకులపై చాహల్ సంచలన కామెంట్స్
గత ఆరు నెలలుగా భారత జట్టు ఏ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనప్పటికీ, అభిషేక్ శర్మ గతంలో చేసిన అద్భుతమైన ప్రదర్శనలు, ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని విధ్వంసక బ్యాటింగ్, ఈ ర్యాంకు సాధించడానికి తోడ్పడింది. అతని ఈ ఘనత భారత క్రికెట్‌కు ఒక శుభపరిణామని చెప్పవచ్చు. అభిషేక్ శర్మ 2019 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో తన విధ్వంసక ఓపెనింగ్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో అతడు 204.22 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు సాధించాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి, తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు.