AB-PMJAY: అక్టోబర్ 29 ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పెద్దలకు పెద్ద కానుక ఇవ్వనున్నారు. 70 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరి కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) ను ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి:Current Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ
ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా X వేదికగా ఒక పోస్ట్ చేశారు. అంతేకాకుండా, 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య సేవలను అందించేందుకు ఆయుష్మాన్ భారత్‌ను కూడా విస్తరించనున్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్.. వెల్నెస్ పట్ల ఉత్సాహం ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రధాని మోదీ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.