Aanam ramnarayan: కాశీబుగ్గ ఘటనపై మంత్రి ఆనం షాకింగ్ రియాక్షన్

Aanam ramnarayan: శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఘటన జరిగిన ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రాదని, అది పూర్తిగా ప్రైవేట్ ఆలయమని తెలిపారు. ఆలయ నిర్వాహకులు భద్రతా చర్యలను సక్రమంగా చేపట్టలేదని మంత్రి విమర్శించారు. ఘటనకు ముందు సమాచారం ఇచ్చి ఉంటే ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకునేదని ఆయన పేర్కొన్నారు.

ఘటనలో మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలిస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *