Aamir Khan: కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గడంతో ఒకప్పుడు కిటకిటలాడిన సినిమా హాళ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఒక కారణమని టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ గతంలోనే అభిప్రాయపడ్డారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఓటీటీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఓటీటీల వ్యాపార శైలి ఆమోదయోగంగా లేదని, సినిమాలు థియేటర్లలో చూస్తేనే ప్రేక్షకులకు పూర్తి ఆనందం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. “ఓ వస్తువును కొనమని కోరితే, 8 వారాల్లో ఇంటి ముందు పెడతామనే విధానం సరికాదు” అంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Also Read: Kingdom: ‘కింగ్డమ్’ ఫీవర్: ఫస్ట్ సాంగ్ హిట్!
Aamir Khan: ఓటీటీల ఈ బిజినెస్ తీరు మారాలని, థియేటర్ల సౌందర్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించాలని ఆయన పిలుపునిచ్చారు. అమీర్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓటీటీల ప్రభావంపై బాలీవుడ్ స్టార్ ఇలా స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా నిలిచింది.