Aadhaar: ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. రేషన్ కార్డు, బ్యాంకింగ్, స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, గవర్నమెంట్ స్కీమ్స్-ఏ సేవకైనా ఆధార్ తప్పనిసరి. అయితే ఇప్పటివరకు తక్కువ ఖర్చుతో లభించిన ఆధార్ అప్‌డేట్ సేవలు, కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇపుడు భారీగా మొత్తంలో చెలించాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ అప్‌డేట్ – రూ.125
ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్, ఫోటో వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌ల కోసం ఇకపై రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు రూ.100 మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ.25 పెరిగింది. అయితే బ్యాంకులు, ఆధార్ సెంటర్లు అదనంగా సర్వీస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి.
అడ్రస్, మొబైల్ నెంబర్ మార్పు – రూ.75
పేరు, ఫోటో, ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్పులకు కూడా ఛార్జీ పెరిగింది. ఇప్పటివరకు రూ.50 మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
హోం సర్వీస్ – రూ.700
ఇంటికొచ్చి ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాలంటే ముందుగా రూ.350 మాత్రమే ఉండేది. ఇప్పుడు అది డబుల్ అయి రూ.700కి పెరిగింది. ఒకే ఇంట్లో చాలామంది ఒకేసారి అప్‌డేట్ చేయించుకుంటే, మొదటి వ్యక్తి రూ.700 చెల్లించాలి, మిగతా వ్యక్తులు ఒక్కొక్కరూ రూ.350 చెల్లిస్తే సరిపోతుంది.
ఇది కూడా చదవండి: Rahul Ramakrishna: గాంధీ మహాత్ముడే కాడు.. కేటీఆర్, కేసీఆర్ మళ్ళీ రావాలి.. చివరికి అకౌంట్ డిలీట్
ఆన్‌లైన్‌లో ఉచితం – 2026 జూన్ 14 వరకు మాత్రమే
ఆధార్ ఆన్‌లైన్ సర్వీసుల్లో మాత్రం సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే ఎటువంటి ఫీజు లేదు. అయితే ఇది కూడా 2026 జూన్ 14 వరకు మాత్రమే. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్‌డేట్‌కూ ఛార్జీలు విధించే అవకాశం ఉంది.
పిల్లలపై సడలింపు
5–7 సంవత్సరాలు, 15–17 సంవత్సరాల పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌లు ఉచితంగా ఉంటాయని UIDAI స్పష్టం చేసింది. ఈ సేవ కోసం ఏ ఆధార్ సెంటర్‌లోనూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
కొత్తగా పెంచిన ఈ ఫీజులు 2028 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయి. కాబట్టి ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకోవాలనుకునే వారు ఈ మార్పులను తప్పనిసరిగా గమనించాలి.