AA22xA6

AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్

AA22xA6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా AA 22 టీమ్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘రాకా’ గా ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా సన్ పిక్చర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

పోస్టర్ హైలైట్స్..

రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్ ఒక తోడేలును పోలిన జంతువు చేయితో, చాలా భయంకరమైన మరియు ఇంటెన్స్ గెటప్‌లో కనిపిస్తున్నారు. అట్లీ ఈసారి రొటీన్ మాస్ సినిమా కాకుండా, కొత్త రకమైన కథతో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది 22వ సినిమా కాగా, అట్లీకి ఇది 6వ చిత్రం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె నటిస్తుండటం విశేషం. ఇక సంగీత విషయానికి వస్తే, ప్రస్తుతం సెన్సేషన్‌గా మారిన సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రస్తుతానికి ‘రాకా’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప-2 తర్వాత బన్నీ నుండి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *