Karimnagar: ఇద్దరు ప్రేమించుకున్నారు.. సహజీవనం చేస్తున్నారు.. ఇప్పుడిప్పుడు కూడా కాదు దాదాపుగా ఏడేళ్లుగా ఉంటున్నారు.. బాగా చూసుకుంటున్నాడు మరి ఏమి రోగం.. వేరే వాడితో తిరగడం దేనికి.. ఆశలొదు అదే తట్టుకోలేక పట్టాలు ఎక్కాడు.. నేను సస్తున్న అని వీడియో కూడా తీసి బయట పెట్టాడు.. ఇంతకీ వాడు సచ్చాడా లేదా.. లేక నా ప్రియురాలు తిరిజి వస్తుంది అని వెనక్కి వచ్చేసాడా..
ఓ ప్రేమ కథ విషాదంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలానికి చెందిన ఎల్లేష్ అనే యువకుడు ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ యువతి అతనిని వదిలేసి మరొక వ్యక్తిని వివాహం చేస్తున్నట్టు ఆరోపణ.. ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయిన ఎల్లేష్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి సెల్పీ వీడియో తీశాడు.
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఎల్లేష్ ముందు సెల్పీ వీడియో ద్వారా తన ఆవేదన వెళ్లగక్కాడు. హైదరాబాద్ గణేష్‌నగర్ కు చెందిన అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమించినట్లు, పూర్తి అడ్రస్ కనుక్కోండి అంటూ తన తల్లిదండ్రులకు ఎల్లేష్ సూచించాడు.. సదరు యువతికి సెల్‌ఫోన్ కూడా ఇప్పించానని, అయితే తనను మోసం చేసిందని వాపోయాడు. ఒకసారి గర్బాన్ని దాల్చితే తేసివేసినట్లు కూడా చెప్పాడు. అంతేకాదు తన ఆత్మహత్యకు కారణం సదరు యువతి, ఆమె తల్లి అని, వారిద్దరినీ వదిలి పెట్టవద్దని కోరాడు.
తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, తాను ప్రేమించిన యువతి తన శవం వద్దకు రావాలని ఎల్లేష్ కోరాడు. అమ్మా.. ఆస్తులు అమ్మైనా, ఆ అమ్మాయికి చట్టరీత్యా శిక్షపడేలా చేయాలని కోరాడు. అలాగే ఆ యువతి తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని, ఆ యువకుడికి కూడా తమ విషయం తెలిసినా, పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ఆ అమ్మాయి వచ్చే వరకు శవాన్ని తీస్తే తాను ఒప్పుకోనని, గేమ్ ఆడి తనను మోసం చేసిన వారిని వదిలిపెట్టవద్దంటూ కోరాడు.
Also Read: Crime News: నా కూతురిని చంపించి.. నీ కూతురి పెళ్లి చేసుకుంటున్నావా?.. అంటూ దారుణ హత్య
తమ పెళ్ళికి ముందు అంగీకారం తెలిపి రెండు ఇళ్లకు రాకపోకలు సాగేవని, ఇప్పుడు మాత్రం యువతి తల్లి చేసిన నిర్వాకంతో వివాహం ఆగిందని ఎల్లేష్ చెప్పాడు. తనకు ఎలాంటి ఉద్యోగం లేదన్న కారణంతో వేరే వ్యక్తిని సదరు యువతి పెళ్లి చేసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో యువతి, ఆమె తల్లిపై కేసు పెట్టాలని, ఇదే తన చివరి కోరిక అంటూ వీడియో విడుదల చేయడం విశేషం..
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని యువకుడి వద్ద ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తన బిడ్డ వీడియో విడుదల చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.