Hyderabad

Hyderabad: హైద‌రాబాద్‌లో దారుణం.. రోడ్డుపై న‌గ్నంగా ప‌డి ఉన్న యువ‌తి..!

Hyderabad: భాగ్యనగరంలో మరో దారుణం..రోడ్డుపై ఓ యువతి మత్తులో నగ్నంగా పడి ఉంది.. ఇంతకు ఆ యువతికి ఏమైంది.. ఎవరైన మందు తాగించారా..లేక ఆమెకు తాగి మత్తు ఎక్కువై రోడ్డు మీద పడిందా… లేక ఎవరైన ఆ యువ‌తిపై అత్యాచారం చేసి రోడ్డుపై ప‌డేసి ఉంటా..ఇప్పుడు పోలీసులకు ఆ యువతిపై వస్తున్న ప్రశ్నలు.. ఏది ఏమైనా పండుగ పూట ఆ యువతి నడిరోడ్డుపై పడి ఉంటడం దారుణం..

హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. జూబ్లీహిల్స్ లోట‌స్ పాండ్ వ‌ద్ద రోడ్డుపై ఓ యువ‌తి మ‌త్తులో న‌గ్నంగా ప‌డింది. స్థానికులు ఆమెను గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. అప‌స్మార‌క‌స్థితిలో ఉన్న యువ‌తిని 108 అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే యువ‌తిపై అత్యాచారం చేసి రోడ్డుపై ప‌డేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యువ‌తి వ‌య‌సు 30 ఏండ్లు ఉండొచ్చ‌ని పోలీసులు తెలిపారు. బాధితురాలి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *