Tollywood to Bollywood: బాలీవుడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇక సౌత్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ బాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో దాటేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. షారుక్ ఖాన్ అట్లీతో ‘జవాన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. సన్నీ డియోల్ తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘జాట్’ సినిమా చేసి హిట్ సాధించాడు. రణ్‌బీర్ కపూర్ కూడా సందీప్ రెడ్డి వంగాతో ‘యానిమల్’ సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. తాజాగా అమీర్ ఖాన్ లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. సల్మాన్ ఖాన్ కూడా తెలుగు డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. హృతిక్ రోషన్ కూడా సౌత్ డైరెక్టర్‌తో తదుపరి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోలకు వరుస హిట్స్ అందిస్తుండటంతో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ గొప్పతనం గురించి చెప్పుకున్నవారు ఇప్పుడు సౌత్ జోష్ చూసి ఆ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
