Tirupati Crime

Tirupati Crime: మూడున్నరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..

Tirupati Crime: రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ఆడవారు అర్ధరాత్రే కాదు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

తాజాగా అభంశుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి ఓ దుర్మార్గుడు కర్కశంగా చిదిమేశాడు. అప్పటిదాకా నవ్వుతూ ఆడుకుంటున్న ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా చోటుచేసుకుంది.

Tirupati Crime: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను చంపేసి పూడ్చిపెట్టాడు. రాత్రి బాగా పొద్దుపోయినా బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చుట్టుపక్కలా గాలించినా పాప ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కుమార్తెపై ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేపట్టారు.

Tirupati Crime: ఇటీవలే మాచర్లలో కన్నబిడ్డపై ఓ తండ్రి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రోజూ రాత్రిపూట కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి కుటుంబ సభ్యులకు తాగించేవాడు. ఆపై కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం వేళల్లో ఆ చిన్నారి మూత్ర విసర్జనకు వెళ్లి బాధతో ఏడుస్తుంది. అనుమానం వచ్చిన ఆ తల్లి బిడ్డను తీసుకుని ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా అక్కడి వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని చెప్పారు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. తన భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రహించి అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *