Dhurandhar: రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రెండు భాగాలకు కలిపి 130 కోట్ల డీల్ జరిగినట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Lucky Bhaskar Sequel: భారీగా లక్కీ భాస్కర్ సీక్వెల్?
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్, ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు షాకింగ్ డీల్ జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ రెండు భాగాల డిజిటల్ రైట్స్‌ను 130 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక్కో భాగానికి సుమారు 65 కోట్లు పడినట్లు తెలుస్తోంది. ఓటీటీ ధరలు పడిపోతున్న సమయంలో ఇంత భారీ డీల్ రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో అతిపెద్దదిగా నిలుస్తోంది. కొన్ని రూమర్లు 285 కోట్ల డీల్ అని చెబుతున్నప్పటికీ నిజానికి 130 కోట్లే అని నమ్మకమైన సోర్సులు తెలిపాయి. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత, 8 వారాలకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జనవరి చివరి వారంలో ఓటీటీలో రావచ్చని అంచనా.

