Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా, వాయిదాలతో ఆలస్యమైనప్పటికీ, బిజినెస్ పరంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 140 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో 100 కోట్ల బిజినెస్ నమోదైనట్లు సమాచారం.అయితే, ఈ భారీ టార్గెట్‌ను సాధించడం సినిమాకు సవాలుగా మారింది. ఆలస్యం కారణంగా అభిమానుల్లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ‘హరిహర వీరమల్లు’ ఈ అంచనాలను అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, బాబీ దేవోల్, నిధి అగర్వాల్ వంటి తారలతో ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పవన్ స్టార్ పవర్ ఈ టార్గెట్‌ను ఛేదిస్తుందా? వేచి చూడాలి.
