A. R. Rahman:

A. R. Rahman: మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఏఆర్ రెహ‌మాన్‌కు అస్వ‌స్థ‌త‌

A. R. Rahman:ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ ఆదివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఉద‌య‌మే ఆయ‌న ఛాతీనొప్పితో బాధ‌ప‌డుతుండ‌గా, కుటుంబ స‌భ్యులు ఆయ‌నను చెన్నై న‌గ‌రంలోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆ ఆసుప‌త్రి వైద్యులు వైద్య చికిత్స‌లు అందిస్తున్నారు. గుండె సంబంధిత ఈసీజీ, ఇత‌ర వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు స‌మాచారం.

A. R. Rahman:ఆస్కార్ అవార్డు గ్ర‌హీత అయిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ రెహ‌మాన్ అస్వ‌స్థ‌త‌తో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిన అభిమానులు ఆందోళ‌న‌తో ఉన్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వారు కోరుకుంటున్నారు. వివిధ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై గెట్ వెల్ సూన్ రెహ‌మాన్‌.. అంటూ పోస్టులు వెల్లువ‌లా వెలుస్తున్నాయి.

A. R. Rahman:రెహ‌మాన్ ఇటీవ‌లే విడుద‌లై సంచ‌నాలు న‌మోదు చేస్తున్న చావా చిత్రానికి సంగీతం అందించారు. ప్ర‌స్తుతం రామ‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఆర్సీ 16 సినిమాకు కూడా ఆయ‌న సంగీతం అందిస్తున్నారు. దీనికోసం ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ను కంపోజ్ చేసిన‌ట్టు ఆయ‌నే ఇటీవ‌ల వెల్ల‌డించ‌డం విశేషం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *