Drunken Man: స్నేహితులతో కలసి ఫుల్లుగా మందేశాడు. అడుగుతీసి అడుగు వేయలేనంతగా మత్తెక్కింది. రోడ్డుపక్కనే పడిపోయాడు. తెల్లారింది. మెలకువ వచ్చింది. వచ్చిన వెంటనే యూరిన్ వెళ్లాలని ప్రయత్నించిన మనోడికి మతిపోయింది. అతని పురుషాంగంలో ఎదో మెటాలిక్ బాల్ దూర్చి ఉంది. దానిని బయటకు తీయడానికి ప్రయత్నించాడు. వీలుకాలేదు.
ఈ ఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లా కాంచనగడ్ లో చోటు చేసుకుంది. కూలిపనులు చేసుకుని జీవించే 46 ఏళ్ల వ్యక్తి నిత్యం మద్యం సేవిస్తాడు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. బాగా ఎక్కువగా తాగడంతో మత్తు ఎక్కి కదలలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో ఒంటి మీద స్పృహలేకుండా రోడ్డుపక్కనే పడిపోయాడు. తన పురుషాంగంలో ఎదో వస్తువు ఉండడం చూసిన అతను దానిని తీయాలని ఏంతో ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండు రోజులు అయినా దానిని తీయలేకపోయాడు. ఈలోపు పురుషాంగం వాచిపోయింది. భరించలేని నొప్పితో ఆ వ్యక్తి విలవిలలాడాడు. ఇక చేసేదేం లేక ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
Also Read: CA Exams: సీఏ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల విధానం మారింది!
Drunken Man: అక్కడ డాక్టర్లు చాలా విధాలుగా దానిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. అనస్థీషియా ఇచ్చి దానిని తొలగించడానికి ప్రయత్నించారు. కానీ, వారు అలా కూడా దానిని తీయడం సాధ్యపడలేదు. దీంతో డాక్టర్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అత్యంత ఖచ్చితమైన కటింగ్ యంత్రాన్ని ఉపయోగించి గంటన్నర పాటు శ్రమించి ఆ మెటాలిక్ బాల్ ను ముక్కలు చేసి బయటకు తీశారు. ఆ మెటాలిక్ బాల్ కట్ చేసేటప్పుడు వచ్చే వేడిని తగ్గించడానికి, వారు పురుషాంగంపై నిరంతరం నీటిని పోస్తూ వచ్చారు.
ఆ బాల్ తొలగించిన తర్వాత, కార్మికుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఈ వార్త కేరళలో వైరల్ అవుతోంది. అతని పురుషాంగంలోకి ఆ బాల్ ఎవరు గుచ్చారో ఇప్పటికీ తెలియరాలేదు. అతనితో పాటు మద్యం సేవించిన అతని స్నేహితులు లేదా రోడ్డుపై పోతున్న మరెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ ఘటనపై బాధితుడు లేదా బాధితుడి బంధువులు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.