Level Crossing

Level Crossing: రైలు గేటు పడిన ఫస్ట్రేషన్ లో ఈ వ్యక్తి చేసిన పని చూడండి.. వార్నీ ఎవడేండీడు అని ముక్కున వేలేసుకుంటారు

Level Crossing: మన దేశంలో ప్రజలు ఒక్కోసారి చేసే చేష్టలు చూస్తే నవ్వొస్తుంది. అదేవిధంగా వారిని చూస్తే జాలి కూడా అనిపిస్తుంది. ఫస్ట్రేషన్ ఆపుకోలేక చేసే కొన్ని పనులు నవ్వు పుట్టిస్తాయి. అదే సమయంలో అరే ఎందుకంత కష్టం.. కాస్త ఓపిక పట్టొచ్చుగా అని అనిపిస్తుంది. మళ్ళీ.. చూస్తన్న మనకేం తెలుసు ఆ వ్యక్తి ఫస్ట్రేషన్ అని కూడా అనిపిస్తుంది. అలాంటి స్టోరీనే ఇది.

ఒక వ్యక్తి రైలు గేటు పడడంతో పట్టాలను దాటడానికి తన బైక్ ను బాహుబలి రేంజిలో భుజం మీద వేసుకుని దాటేశాడు. అలవోకగా బండిని భుజాన వేసుకుని పట్టాలు దాటేసిన అతన్ని చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఈ సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో రేల్వే గేటు మూసి ఉండడటం కనిపిస్తోంది. ఈలోపు ఒక వ్యక్తి బైక్ పై ఆ గేటు వద్దకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. బైక్ నుంచి కిందకు దిగాడు. ఆ తరువాత అమాంతం ఆ బైక్ ను భుజానికెత్తుకున్నాడు. గబ గబా నడుస్తూ పట్టాలు దాటుకుని అవతల పక్కకు చేరుకొని.. అక్కడ బైక్ కిందకు దింపి దానిపై ఎక్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారంతా ఆ వ్యక్తి చేసిన పనిని చూసి అవాక్కయ్యారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఖరీదైన కారు.. చిల్లర చేష్టలు.. రోడ్డుమధ్యలో కారు ఆపి వీడు చేసిన పని చూస్తే ఛీ అంటారు..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. కొందరు వీడెవడండీ బాబూ అంటుంటే.. మీరు మారరా? అని కొంతమంది అంటున్నారు. మనదేశంలో ఇలాంటి వారున్నంత వరకూ పరిస్థితులు మారవు అని ఒకరు ఘాటుగా వ్యాఖ్యానించారు. అతి తెలివి అంటూ కొందరు అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే బండి ఎక్కి వెళ్లాల్సినవాడు.. బండి ఎత్తుకుని వెళ్లిన ఆ వ్యక్తి ప్రస్తుతం నెట్టింట బాగానే వినోదం పంచుతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *