Dates Box

Dates Box: చేతిలో ఖర్జూరం బాక్స్ తో విమానం దిగిన వ్యక్తి.. చెక్ చేసిన అధికారులకు షాక్!

Dates Box: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. జెడ్డా నుంచి విమానం వచ్చింది. అందులోంచి ప్రయాణికులు దిగి సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి చేతిలో ఒక ఖర్జూరం బాక్స్ తో వచ్చాడు. మామూలుగానే అతని లగేజీ స్కాన్ చేశారు అధికారులు. తరువాత అతనిని తనిఖీ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయని వదిలేశారు. ఆ వ్యక్తి కొద్దిగా ముందుకు కదిలిన తరువాత అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ కు ఎదో తేడాగా అనిపించింది. ఆ ప్రయాణీకుడిని మళ్ళీ వెనక్కి పిలిచాడు. చేతిలో ఉన్న ఖర్జూరం బాక్స్ ఓపెన్ చేయమన్నాడు. దాన్ని ఓపెన్ చేసి చూసిన అధికారులకు మతిపోయింది. ఎందుకో తెలియాలంటే ఈ వివరాలు చూడాల్సిందే. 

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖర్జూరం లోపల పెట్టి అక్రమంగా తరలిస్తున్న 172 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమాసియా దేశమైన సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి 56 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. కస్టమ్స్ కంప్యూటర్ ‘స్పాట్ ప్రొఫైలింగ్’ ఉపయోగించి అతన్ని అనుమానాస్పద వ్యక్తిగా వర్గీకరించింది.
తరువాత, కస్టమ్స్ అధికారులు అతని వస్తువులన్నింటినీ ఎక్స్-రే చెక్ చేశారు. అంతా బాగానే కనిపించింది. దీంతో అతనిని వదిలేశారు. కానీ, ఒక అధికారికి అనుమానం వదల్లేదు. మళ్ళీ ఆ ప్రయాణీకుడిని చెక్ చేశారు. అతని వద్ద ఉన్న ఖర్జూరం బాక్స్ ను చెక్ చేశారు. ఆ ఖర్జూరాల్లో లోహాలు ఉన్నాయని తేలింది. ఆ పండ్లను ఒక ప్లేట్ లో పోసి వేరు చేసినప్పుడు, లోపల బంగారు ముక్కలు, ఒక గొలుసు ఉన్నాయి.
స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 172 గ్రాములు. దీని మార్కెట్ విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

అదేవిధంగా, థాయిలాండ్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు మహిళలు వారి వద్ద 27 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీని విలువ 27 కోట్ల రూపాయలు. కస్టమ్స్ అధికారులు వారిద్దరినీ అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ కు కేటీఆర్ నివాళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *