Laila: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక లైలా సినిమా రిలీజ్ అయ్యింది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో లేడీ గెటప్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. లేడీ గెటప్ లో విశ్వక్ అదరగొట్టాడు. తన నటనకు అందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. కథ ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమాలో విశ్వక్ నటన ఆకట్టుకుందని.. సినిమా కోసం అతను పడిన కష్టం కనపడుతుందని అంటున్నారు. అలాగే పాటలు చాలా బాగున్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువగా యూత్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి విశ్వక్ మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు.మరి చూడాలి మున్ముందు ఈ సినిమా ఎలా ఆడుతుంది అనేది..
