Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టైలిష్ హీరో.. దర్శకుడు అట్లీతో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కూడా లైన్‌లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ బిగ్ బడ్జెట్ మూవీలో బాలీవుడ్&హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను సంప్రదించారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అల్లు అర్జున్ సరసన ఆడిపాడేందుకా.. లేక వేరే కీలక పాత్ర కోసమా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్ స్టేజ్‌లోనే ఉన్నప్పటికీ.. సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ప్రియాంక.. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తోంది.
Also Read: Peddi: ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై న్యూ అప్డేట్!
Allu Arjun: అయినా, టాలీవుడ్ దర్శకులు ఆమె కోసం క్యూ కడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటిదాకా తెలుగులో ఆమె రామ్ చరణ్‌తో ‘తుఫాన్’లో మాత్రమే నటించింది. ఇప్పుడు అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో ఆమె ఎంట్రీ ఇస్తే.. టాలీవుడ్‌లో మరోసారి సందడి చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ గాసిప్ నిజమవుతుందా? ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? వేచి చూడాలి!