Nani-Dulquer Salmaan : నాని తాజాగా ‘హిట్ 3’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు నాని తన నిర్మాణ సంస్థలో దుల్కర్ సల్మాన్‌తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
Also Read: Thug Life : ‘థగ్ లైఫ్’ గ్రాండ్ ప్లాన్: ఓ రేంజిలో ట్రైలర్, ఈవెంట్స్?
Nani-Dulquer Salmaan: ఈ కాంబినేషన్ ఖరారైతే, వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని, దుల్కర్ జోడీ మరో సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త కాంబో ఎలాంటి కథతో అలరిస్తుందనేది త్వరలో తెలియనుంది.