Hyderabad: ఒక వీడియో తీసాడు అని ఆమె అంటుంది. చీర మార్చుకుంటూ ఉంటె…సెల్ ఫోన్ తీసి చిక్రీకరించాడు అని ఆ టీచర్. మరి తీసాడా లేదా ? తెలియదు. తీయకుండా ఉండాలి అనే కోరుకుందాం. ఎందుకంటే ..ఒక మహిళా ఇష్యూ కాబట్టి. ఇంతకీ ఏమి జరిగింది ఆ కాలేజీలో. పోలీసులు ఐతే వచ్చారు …ఆరా తీశారు. అనుమానితుడిని పట్టుకున్నారు. ఇంతకీ ఎవడు ఆ అనుమానితుడు అనే కదా …చూసి షాక్ అవ్వకండి
హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం జరిగింది. స్థానిక కాలేజీలో ఒక మహిళా లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో కాలేజీ ప్రిన్సిపల్, క్లర్క్ వీడియోలు తీసిన ఘటన కలకలం రేపింది. దీంతో విద్యార్థినీలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగడంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది కూడా చదవండి: Tummala nageshwar rao: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
Hyderabad: బేగంపేట్ లోని మహర్షి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న మహిళా లెక్చరర్ గదిలో చీర మార్చుకుంటున్న సమయంలో ప్రిన్సిపల్ ,క్లర్క్ వీడియో తీశారని బాధిత లెక్చరర్ ఆరోపించింది. ఈ విషయాన్ని విద్యార్థునులకు చెప్పడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధితురాలుతో కలిసి విద్యార్థులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.
ఘటనకు కారణమైన ప్రిన్సిపల్, క్లర్క్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలేజీముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత లెక్చరర్ తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడుతానని తేల్చి చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లడంతో ఆయా సంఘాల నాయకులు ప్రిన్సిపల్ ను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా లెక్చరర్ కు జరిగిన అవమానాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆమెకు న్యాయం జరిగే వరకు ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
హైదరాబాద్ నడిబొడ్డున కీచకపర్వం
కాలేజీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసిన ప్రిన్సిపల్, క్లర్క్
బేగంపేట్ మహర్షి కాలేజీలో ఘటన
కాలేజీ ముందు బాధితురాలుతో సహా విద్యార్థుల ఆందోళన pic.twitter.com/Ll3VThOc8w
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025