Digital Arrest: డిజిటల్ అరెస్ట్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. ప్రజల్లో దీనిపై ఇంకా అవగాహన రాలేదు. తాజాగా చంద్రపాన్ పాలివాల్ అనే వ్యక్తి డిజిటల్ అరెస్ట్ కు దొరికిపోయాడు. కోటీ పదిలక్షల రూపాయలు వదిలించుకున్నాడు.
చంద్రపాన్ పలివాల్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందినవాడు. 1వ తేదీన అతను ఇంట్లో ఉన్నప్పుడు, కొంతమంది వీడియో కాల్ ద్వారా అతన్ని సంప్రదించి తమను తాము ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు.
ఆ తర్వాత వారు బలివాల్ మొబైల్ ఫోన్ సిమ్ కార్డును బ్లాక్ చేస్తామని బెదిరించారు. ఒక్క ముంబైలోనే పాలివాల్‌పై 24 కేసులు నమోదయ్యాయని కూడా వారు తెలిపారు.
కొంత సమయం తర్వాత, ఈ విషయం గురించి ఒక IPS అధికారి మీతో మాట్లాడతారని చెప్పి, వీడియో కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. తర్వాత కొన్ని నిమిషాల్లోనే, ముంబైలోని కొలాబా పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్న సీబీఐ అధికారినని చెప్పుకుంటూ మరొక వ్యక్తి పాలివాల్‌ను సంప్రదించాడు.
ఇది కూడా చదవండి: Crime News: ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం
తరువాత, “మేము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని డిజిటల్‌గా అరెస్టు చేసాము” అని అన్నాడు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే కొంత డబ్బు పాలని చెప్పాడు. అలా ఐదు రోజుల పాటు పాలివాల్ నుంచి ఆన్‌లైన్‌లో మొత్తం 1.10 కోట్ల రూపాయలు లాగేశారు. ఇంత డబ్బు పోయిన కానీ, పాలివాల్ కు జ్ఞానోదయం కాలేదు. తాను ఇరుక్కున్నానని. మోసపోయానని అర్ధం అయింది. అప్పడు పోలీసుఅల్కు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదని. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

