Crime News

Crime News: కారుతో ఢీకొట్టి.. వెంటాడి కత్తులతో నరికి హత్య

Crime News: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో, శివగంగ కాలనీలో బొడ్డు మహేష్ అనే వ్యక్తిని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో నరికి హత్య చేయడం కలకలం రేపింది. ముందుగా అతనిని కారుతో ఢీకొట్టి, పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ వెంటాడి మరీ చంపేశారు. ఈ ఘోర సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది.

మహేష్ గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి, అవి ఇప్పుడు దర్యాప్తుకు సహాయపడుతున్నాయి.

Also Read: Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడుద‌ల ర‌జినిపై ఏసీబీ కేసు?

Crime News: కుటుంబసభ్యులు మహేష్‌ను ఓ పథకం ప్రకారమే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. గతంలో అతను ఓ క్లినిక్‌లో ఇద్దరిపై కత్తితో దాడి చేసి జైలుకు వెళ్లాడు. తాజాగా, అతను విడుదలైన విషయం తెలిసిన ప్రత్యర్థులు అతనిపై పగ పట్టుకుని హత్య చేసారని అనుమానిస్తున్నారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *